గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌లో పాల్గొన్న మెగా ఫామిలీ..!!

January 26, 2021 at 2:21 pm

దేశ వ్యాప్తంగా నేడు గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. భార‌త ప్ర‌జ‌లు అంతా మన జాతీయ జెండా ఎగురవేస్తూ జాతీయ భావాన్ని చాటు కుంటున్నారు. తాజాగా చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్‌, నాగ‌బాబు, అల్లు అర‌వింద్ కూడా పాల్గొన్నారు.

అంత‌క‌ ముందు చిరు త‌న ట్వీట్ ద్వారా గ‌ణ‌తంత్ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయమని తన బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను అంటూ చిరు చెప్పకొచ్చారు. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసి‌, చేస్తున్న రక్త‌ దాతలకు నా హృద‌య పూర్వక ధ‌న్య ‌వాదాలు. ర‌క్త దానం చేయండి, ప్రాణ దాత‌లు కండి అంటూ చిరంజీవి త‌న వాయిస్ వీడియో ద్వారా ఈ సందేశాన్ని అందరికి అందించారు.

గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌లో పాల్గొన్న మెగా ఫామిలీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts