మోనాల్‌తో అఖిల్‌, సోహెల్‌ల ర‌చ్చ ..!!

January 13, 2021 at 2:18 pm

బిగ్ బాస్ సీజ‌న్ 4 లో కొంత మంది హౌస్ మేట్స్ మ‌ధ్య స్ట్రాంగ్ బాండింగ్ నెల‌కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోనాల్‌, అఖిల్‌లు క్యూట్ క‌పుల్‌గా మంచి గుర్తింపు పొందారు. సోహెల్‌ అఖిల్‌లు ప్రేమ‌దేశం ఫ్రెండ్స్ అంటూ నెటిజన్స్ పేరు కూడా పెట్టారు. ఇక మోనాల్‌ సోహెల్ మధ్య బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ రిలేష‌న్ కాగా, హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా వీరు త‌మ రేలషన్ షిప్ ని కొన‌సాగిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

న్యూ ఇయ‌ర్ రోజు అఖిల్‌, సోహెల్, మోనాల్ ముగ్గురు క‌లిసి తెగ సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా అఖిల్‌, సోహెల్‌లు మోనాల్‌కు రెడ్ రోజ్ ఇస్తూ దిగిన ఫొటోలు అదిరిపోయాయి. ఈ పిక్స్ అఖిల్ త‌న ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ చేయ‌డంతో బాగా వైర‌ల్ అయ్యాయి.

మోనాల్‌తో అఖిల్‌, సోహెల్‌ల ర‌చ్చ ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts