శ్రీ‌రాముడిపై మోనాల్ షాకింగ్ కామెంట్స్‌.. నెటిజ‌న్లు ఫైర్‌!

January 26, 2021 at 10:31 am

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌లో పాల్గొన్న మోనాల్‌.. సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్ర‌మంలోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఈ గుజ‌రాతి భామ‌. తెలుగులో ఓ ఐదారు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు పొంద‌లేని మోనాల్‌.. బిగ్ బాస్ షో ద్వారా మాత్రం ఎక్కువ ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మోనాల్‌.. ఓంకార్ నిర్వహిస్తున్న డ్యాన్స్+ అనే షోలోనూ జడ్జ్‌గా మారిపోయింది. మ‌రోవైలు ఐటం సాంగ్స్ చేస్తూ.. భారీగా ఛార్జ్ చేస్తోంది. మొత్తానికి ప్ర‌స్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న మోనాల్‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీ‌రాముడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని మోనాల్ గజ్జర్‌ను ప్ర‌శ్నింగా.. దీనికి ‘శ్రీక‌ృష్ణుడు లాంటి భర్త కావాలి’ అని జవాబిచ్చింది.

దీంతో స‌ద‌రు యాంక‌ర్.. అదేంటి, ఎవరైనా కూడా శ్రీ రాముడి లాంటి భ‌ర్త‌ కావాలంటారు కానీ కృష్ణుడు ఏంటి అంటూ ప్ర‌శ్నించ‌గా.. రాముడు నచ్చడు అంటూ సంచలన సమాధానం చెప్పింది మోనాల్‌. అంతేకాదు ఎవరో చెప్పిన మాట విని భార్యను అనుమానించాడు.. ఒకవేళ ఆయన తనకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తానంటూ షాకింగ్ చేసింది. ఇక మోనాల్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవ్వ‌డంతో.. నెటిజ‌న్లు మోనాల్‌పై ఫైర్ అవుతున్నారు. శ్రీ రాముడి గురించి ఏం తెలుసుకుని.. నోరు పారేసుకుంటున్నావు.. నువ్వు సారీ చెప్పకపోతే క‌థ వేరే ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి శ్రీ‌రాముడి విష‌యంలో నోరుజారిన మోనాల్.. అడ్డంగా ఇరుక్కుంది.

శ్రీ‌రాముడిపై మోనాల్ షాకింగ్ కామెంట్స్‌.. నెటిజ‌న్లు ఫైర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts