సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో మోస‌గాళ్లు న్యూ పోస్ట‌ర్ రిలీజ్..!!

January 13, 2021 at 1:30 pm

మంచు విష్ణు హీరోగా వస్తున్న తాజా చిత్రం మోసగాళ్లు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో రూపొందుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి, నవదీప్‌, నవీన్‌చంద్ర, రుహీసింగ్‌ ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఏసీపీ కుమార్‌గా ఐటీ కుంభకోణానికి సంబంధించిన నిందితులను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కనిపించనున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల మూవీ టీజ‌ర్ రిలీజ్ కాగా, ఇది అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక తాజాగా సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం నుండి పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. మూవీ పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంటుంది.

సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో మోస‌గాళ్లు న్యూ పోస్ట‌ర్ రిలీజ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts