‘మిస్టర్ & మిస్’ ట్రైలర్ రిలీజ్..!!

January 22, 2021 at 2:29 pm

తాజాగా దర్శకుడు అశోక రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం మిస్టర్ & మిస్. ఈ సినిమాలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు. ఈ సందర్బంగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తే, అమలాపురం ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఉద్యోగం కోసం ముంబైకి వెళ్ళటం అక్కడ ముంబైకి చెందిన మోడ్రన్ అమ్మాయితో పరిచయం ఏర్పడటం.

ఆ యువకుడుకి ఇంగ్లీష్ రాకపోవటం వల్ల ఎదురైనా ఇబ్బందులు , ఆ తరువాత ఇద్దరు ప్రేమలో పడటం లాంటివి ట్రైలర్ లో చూపించే విధానం చాలా ఆకట్టుకుంది. మరి ఆ తర్వాతేమైంది అనేదే ఈ చిత్ర కథగా దర్శకుడు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ‘మిస్టర్ అండ్ మిస్’ సినిమా ఈనెల 29న రిలీజ్ కాబోతుంది. మా మిస్టర్ అండ్ మిస్ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంటూ చిత్రబృందం తెలిపింది.

‘మిస్టర్ & మిస్’ ట్రైలర్ రిలీజ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts