పండుగ టైంలో మండుతున్న మటన్ ధరలు..!!

January 15, 2021 at 3:00 pm

సంక్రాంతి పండుగ సందర్భంగా మాంసం ధరలు బాగా పెరిగిపోయాయి. మాములుగా కిలో మటన్ ధర రూ.500 నుంచి రూ.600 మధ్యలో ఉండేది. అలాంటిది ప్రస్తుతం కిలో మటన్ ధర రూ.800 నుండి రూ.1000 వరకు పలుకుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాంసం ధరలు ఇలా అమాంతం పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి వరుస కథనాలు వస్తున్న తరుణంలో చికెన్ కు డిమాండ్ తగ్గి ఇప్పుడు తాజాగా మటన్‌ కు భారీ డిమాండ్ పెరిగింది.

కానీ డిమాండ్‌ కు తగినంత సప్లయ్ లేదు. దీనితో మాంసపు వ్యాపారులు వీటి ధరలు అమాంతం పెంచినట్లు అందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ కావడంతో ధరలు ఎంత పెరిగినా కూడా మాంసం కొనుగోలు చెయ్యక తప్పదు కాబ్బటి వినియోగదారులు కూడా ఎంత రేట్ ఉన్నా మాంసం కొనడానికి వెనుకాడటం లేదు.

పండుగ టైంలో మండుతున్న మటన్ ధరలు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts