ఎరుపెక్కిన అందాలతో ఇస్మార్ట్ పోరీ..!!

January 13, 2021 at 1:51 pm

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో కుర్ర‌కారు మతులు పోగొట్టిన హాట్ బ్యూటీ నాభ న‌టేష్‌. చూడగానే వావ్ అనిపించే చక్కని అందం, ఆక‌ట్టుకునే నటన ఈ అమ్మ‌డు సొంతం. గ‌తంలో ప‌లు చిత్రాల్లో న‌టించినా రాని క్రేజ్ ఒక్క ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో ద‌క్కించుకుంది. ఈ సినిమాలో న‌భా ప‌ర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారు. రీసెంట్‌గా అల్లుడు అదుర్స్ అనే మూవీలో న‌టించింది న‌భా న‌టేష్‌.

ఇందులోను త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు గ్లామ‌ర్‌తోను మంచి మార్కులు పొందింది. ఎప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే న‌భా న‌టేష్ త‌న ఫొటో షూట్‌కు సంబంధించిన ఫోటోల‌ను రెగ్యుల‌ర్‌గా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ భామ రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎరుపెక్కిన అంద చందాలతో కుర్రకారును మైమ‌రిపిస్తున్న ఇస్మార్ట్ పోరీ భలే ఇస్మార్ట్ అంటున్నారు చూసినవారంతా.

ఎరుపెక్కిన అందాలతో ఇస్మార్ట్ పోరీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts