అమీర్‌ఖాన్‌ సినిమాలో చైతూ..!!

January 26, 2021 at 3:52 pm

యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌,రామ్‌చరణ్‌, రానా సహా పలువురు ప్రముఖ టాలీవుడ్‌ హీరోలు బీటౌన్‌లో తమ లక్ ని పరీక్షించుకున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి నాగ చైత‌న్య కూడా చేరున్నారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దాలో ఓ కీలక రోల్‌ కోసం చైతూని సంప్రదించారట మూవీ బృందం.

మొదట ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని ఆలోచన చేశారు కానీ ఆయన డేట్స్‌ కుదరకపోవడంతో ఆ ఛాన్స్‌ నాగచైతన్య సొంతం అయింది. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డంతో చైతూ కూడా ఈ మూవీకి ఒక చెప్పినట్లు తెలిసింది. వచ్చేనెలలోనే చైతూ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ నటిస్తుంది.

అమీర్‌ఖాన్‌ సినిమాలో చైతూ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts