ఆక‌ట్టుకుంటున్న `ల‌క్ష్య‌` టీజ‌ర్‌.. నాగ‌శౌర్య‌కు హిట్ ఖాయ‌మా?

January 22, 2021 at 11:31 am

ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ.. త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాగ‌శౌర్య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అందులో `ల‌క్ష్య‌` ఒక‌టి. సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. స్పోర్ట్స్ డ్రామాగా ఆర్చరీ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విలు విద్యలో ఆరితేరిన యువ‌కుడిగా నాగ‌శౌర్య క‌నిపించ‌నున్నాడు.

కేతికా శర్మ హీరోయిన్ గా, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేడు నాగ‌శౌర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ల‌క్ష్య టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. `చాలామందికి ఆట‌తో గుర్తింపు వ‌స్తుంది. కానీ ఎవ‌డో ఒక‌డు పుడ‌తాడు,.. ఆట‌కే గుర్తింపు తెచ్చేవాడు` అనే జ‌గ‌ప‌తి బాబు చెప్పే డైలాగ్ తో మొద‌లైన ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది.

ఈ సినిమా కోసం శౌర్య చాలాక‌ష్ట‌ప‌డ్డాడు. బాడీ పెంచి ఎయిట్‌ ప్యాక్ తెచ్చుకున్నాడు. అయితే ఈ టీజ‌ర్‌లో నాగ‌శౌర్య ప‌డిన క‌ష్ట‌మంత క‌నిపించింది. నాగ శౌర్య లుక్, డిఫరెంట్ గెటప్స్, జగపతి బాబు డైలాగ్స్ ఈ టీజ‌ర్‌లో హైలైట్‌గా నిలిచాయి. అలాగే చివ‌ర్లో `ప‌డిలేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాదం` అంటూ జ‌గ‌ప‌తి బాబు చెప్పిన డైలాగ్ మ‌రింత ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి లక్ష్యతో మళ్లీ శౌర్య‌ సూపర్ హిట్ కొట్టేలాగే క‌నిపిస్తున్నాడు.

ఆక‌ట్టుకుంటున్న `ల‌క్ష్య‌` టీజ‌ర్‌.. నాగ‌శౌర్య‌కు హిట్ ఖాయ‌మా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts