`పోలీసు వారి హెచ్చరిక`.. ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌తో నాగ‌శౌర్య కొత్త సినిమా!

January 22, 2021 at 12:16 pm

`ఊహలు గుసగుసలాడే` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ‌శౌర్య మొద‌ట్లో ల‌వ‌ర్ బాయ్ అనిపించుకున్నా.. ఆ త‌ర్వాత మాత్రం యాక్ష‌న్ సినిమాల్లో కూడా న‌టించి స‌త్తా చాటాడు. ఇక ప్ర‌తి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటున్న ఈ హ్యాడ్స‌మ్ హీరో.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.

ఇ‌టికే లక్ష్మీ సౌజన్య దర్శక‌త్వంలో `వ‌రుడు కావలెను`, సంతోష్ జాగర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ల‌క్ష్య‌` సినిమాలు చేస్తున్న నాగ‌శౌర్య‌.. త‌న సొంత బ్యానర్‌లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాను కూడా చేస్తున్నారు. ఇక ఈ మూడు సినిమాలు పూర్తి కాకుండానే.. తాజాగా మ‌రో సినిమాను కూడా ప్ర‌క‌టించారు ఈ యంగ్ హీరో.

అదే `పోలీసు వారి హెచ్చరిక`. ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి కేపీ రాజేంద్ర ద‌ర్శక‌త్వం వహించ‌నున్నాడు. మార్చి నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని శిఖ‌ర కోనేరు స‌మ‌ర్పణ‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమాను ప్ర‌క‌టించిన చిత్ర యూనిట్‌.. ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్టర్ వైర‌ల్‌గా మారింది.

`పోలీసు వారి హెచ్చరిక`.. ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌తో నాగ‌శౌర్య కొత్త సినిమా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts