
సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు అది జరగలేదు.
దీంతో గత కొద్ది కాలంలో హీరోగా నటించేందుకు మోక్షజ్ఞ ఏ మాత్రం సిద్ధంగా లేడని.. ఆయన బిజినెస్మేన్గా మారబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ ఈ ఏడాదే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తాన్ని బాలయ్య ఖరారు చేసినట్టు సమాచారం.
అంతేకాదు బాలయ్య తన కుమారుడిని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలె ఓ కథను బాలయ్యకు కూడా వినిపించాడట పూరీ. దానికి ఫిదా అయిపోయిన బాలయ్య వెంటనే దాన్ని ఓకే చేశాడని తెలుస్తోంది. 2021 చివర్లో ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.