ఫిబ్రవరి 26న విడుదల కానున్న అక్షర..!!

January 24, 2021 at 2:58 pm

నందిత శ్వేతా లీడ్ రోల్ లో నటించిన మూవీ అక్షర. ఈ చిత్రం హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ అక్షర చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదల చేస్తున్నాం. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా అక్షర చిత్రం రూపొందింది .

ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజ‌ర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోవిడ్ వల్ల ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఓటీటీ లో విడుదల చేసేందుకు మంచి ఆఫర్లు వచ్చాయి కానీ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు ఆగాము అంటూ చెప్పారు దర్శక నిర్మాతలు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

ఫిబ్రవరి 26న విడుదల కానున్న అక్షర..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts