బొమ్మ బ్లాక్‌బస్టర్ లిరికల్ వీడియో రిలీజ్..!!

January 24, 2021 at 3:08 pm

నందు విజయ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్. ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు కొత్త దర్శకుడు రాజ్ విరాట్ పరిచయం కానున్నాడు. ఈ మూవీ టీజర్ సినీ వర్గాల్లో కూడా మంచి స్పందన సంపాదించుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన

మొదటి లిరికల్ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో రిలీజ్ అయ్యి అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో నందూ కూడా చాలా నాచురల్ గా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సాంగ్ ని యంగ్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశాడు. ఈ చిత్రం నందూకి కెరీర్ కి మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నారు.

బొమ్మ బ్లాక్‌బస్టర్ లిరికల్ వీడియో రిలీజ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts