జోరుగా నడుస్తున్న శ్యామ్ సింగరాయ్..!!

January 18, 2021 at 2:45 pm

నాచురల్ స్టార్ నాని మూవీ అంటే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తుంటారు. కచ్చితంగా మళ్లీ కొత్త కథను తీసుకొస్తాడని నమ్ముతారు. అయితే ప్రస్తుతం తాజాగా ఈ నాచురల్ స్టార్ చేస్తున్నచిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని పాన్‌ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రం గత జన్మలకు సంబంధించిన కథ అని కొందరు, సోషియో ఫాంటసీ అని మరికొందరు అంటున్నారు.

అయితే ఈ చిత్రం అసలు కథ ఏంటి అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ సివారులోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక్కడ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నరట. అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ సన్నివేవాలను కూడా రూపొందిస్తున్నట్లు వినికిడి. శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది. భారీ కాస్టింగ్, సెట్టింగ్‌లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

జోరుగా నడుస్తున్న శ్యామ్ సింగరాయ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts