బంగారు బుల్లోడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజే నట…!?

January 21, 2021 at 1:33 pm

ప్రముఖ నవ్వుల హీరో అల్లరి నరేష్ ఎప్పటి కప్పుడు సరికొత్త తరహా వినోదంతో ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. నరేష్ చిత్రం అంటేనే ఒక రేంజ్ లో హంగామా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అయితే ఈ నవ్వుల హీరో తాజాగా చేస్తున్న చిత్రం బంగారు బుల్లోడు. ఈ మూవీని పీవీ గిరి దర్శకత్వంలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన పూజా జావేరీ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా పోసాని కృష్ణమురళీ, తనికెళ భరణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అంతేకాకుండా ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ, రొమాన్స్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరీ 23న రెలీజ్కు సిద్దంగా ఉంది. ఈ సందర్బంగా చిత్రం దర్శక నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకను నేడు రాత్రి 7 గంటల నుంచి మొదలు కానుంది. ఈ ఈవెంట్‌ను జయ మీడియా వారి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో నరేష్ అలరిస్తాడో లేదో వేచి చూడాలి.

బంగారు బుల్లోడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజే నట…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts