
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ చంద్ర. ప్రస్తుతం మంచి కంటెంట్ మూవీస్ చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ చంద్ర త్వరలోనే మరో డిఫరెంట్ కథతో మన ముందుకు రాబోతున్నారు. నవీన్ చంద్ర హీరోగా అరవింద్ దర్శకత్వంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. శర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన జవ్వాజి రామాంజనేయులు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
జిబ్రాన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పి.జి ముత్తయ్య సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ భాధ్యతలు సిద్దార్ధ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలోనే తెలియజేయనున్నారు మూవీ దర్శక నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు కానుంది.