“నేడే విడుదల” ట్రైలర్ విడుదల..!!

January 26, 2021 at 2:54 pm

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని నటి నటులుగా తెరకెక్కుతున్న చిత్రం నేడే విడుదల. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి లాంచ్ చేసాడు, ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, నేడే విడుదల అనే చిత్రం ట్రైలర్ చూసాను, నేనే దానిని లాంచ్ చేయడం కూడా జరిగింది. మూవీ ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉంది, కెమెరా వర్క్ అండ్ ఆర్ ఆర్ చాలా బాగున్నాయి. సినిమా పేరు కూడా చాలా క్రియేటివ్ గా పెట్టారు. ఇండస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్టు పైరసీ మీద దాంట్లో వర్క్ చేసినట్టుంది. ఈ మూవీ బాగా ఆడాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అంటూ చెప్పారు.

చిత్ర డైరెక్టర్ రామ్ రెడ్డి పన్నాల మాట్లాడుతూ మా చిత్రం నేడే విడుదల సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసిన మారుతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ పైరసీ లో చేస్తున్నప్పటికీ మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆయన అన్నారు. సినిమాను ప్రేమించే ప్రతిఒక్కరూ మా సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మరియు రెండు సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ ని కూడా ప్రేక్షకులు అంతా చూసి ఆధరించి మాకు సక్సెస్ ఇస్తారు అని కోరుకుంటున్న అంటూ తెలిపారు. హీరో అసిఫ్ ఖాన్ మాట్లాడుతూ రిలీజ్వి అయిన మా సినిమా ట్రైలర్ ని అందరు చూసి మమ్మల్ని ఆధరిస్తారని నమ్ముతున్నాను. సాధారణ ప్రతి సినీ లవర్ కి నచ్చే ఎంటర్టైన్మెంట్ మా చిత్రం లో ఉంది, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. నేను సినిమా సక్సెస్ సాదిస్తుందని నమ్ముతున్నాను అంటూ హీరో అసిఫ్ ఖాన్ తెలియజేసారు.

“నేడే విడుదల” ట్రైలర్ విడుదల..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts