ఎస్బిఐ నుంచి సరి కొత్త సర్వీసులు ప్రారంభం…!?

January 4, 2021 at 3:36 pm

దేశీ ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇకమీదట ఇంటి వద్దనే బ్యాంక్ సర్వీసులు పొందొచ్చు. అంటే ప్రతి విషయానికి బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. చెక్ బుక్, డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ వంటి సేవలు ఇంటి వద్దనే పొందొచ్చు. లైఫ్ సర్టిఫికెట్ పికప్, కేవైసీ డాక్యుమెంట్ల పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, ఫామ్ 15 పికప్ వంటి సేవలు కూడా ఇంటి వద్దనే పొందుచు. మీరు రోజుకు కనీసం రూ.1,000 నుంచి రూ.20,000 వరకు క్యాష్‌ను ఇంటి వద్దకే పొందొచ్చు.

అయితే ఈ సేవలు 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇంకా వికలాంగులు మాత్రమే పొందగలరు. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల్లో భాగంగా బ్యాంక్ ఉద్యోగి కస్టమర్ ఇంటి వద్దకు వచ్చి సేవలను అందిస్తారు. బ్యాంక్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా కాల్ సెంటర్ ద్వారా ఎస్‌బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. బ్యాంక్ పనివేళల్లో 1800111103 నెంబర్‌కు కాల్ చేసి ఈ సేవలు పొందొచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల varaku కాల్ చేసి సేవలని పొందవచ్చు.

ఎస్బిఐ నుంచి సరి కొత్త సర్వీసులు ప్రారంభం…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts