అందుకోసం కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక…!?

January 25, 2021 at 3:01 pm

మెగా ఫ్యామిలీ మొత్తం నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, చైతన్య వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపారు. వివాహ వేడుకలు ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హిందు వివాహ సంప్రదాయం ప్రకారం నిహారిక మెడలో మూడు ముళ్ళు వేశారు చైతన్య. ఈ వేడుకకు సంబంధించిన పిక్స్వీ ఇంకా డియోలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. మొన్నటి వరకు నాగబాబు నిహారిక పెళ్లికి సంబంధించిన కొన్ని యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా రివీల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉదయ్ పూర్ ప్యాలెస్ కు సంబంధించిన వివరాలను కూడా చెప్పారు.

నిహారిక పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకున్నట్లు నాగబాబు చెప్పారు. అయితే ఇటీవల నిహారిక ఒక ఎమోషనల్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో ఆమె భర్త మాటలకు చాలా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. నిహారిక పెళ్లి కూతురిగా సిద్ధం అవుతున్న క్షణంలో చైతన్య తన కాబోయే భార్య కోసం ఒక అద్భుతమైన వీడియో సిద్ధం చేశాడు. దీనితో తాను నిహారిక హార్ట్ ను టచ్ చేసినట్లు తెలుస్తుంది. డియర్ నిహా ఈ వివాహంతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన తరుణంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఇకమీదట నీతో గడపబోయే క్షణాలను తుది శ్వాస వరకు గుర్తు ఉంచుకుంటాను. ముప్పై ఏళ్ళ నా జీవితంలో నేను ఎం కోల్పోయానో నువ్వు వచ్చాకే అర్ధమయ్యింది. నేను నీ కోసమే పుట్టానని, నా జీవితానికి నువ్వే అర్థం అని తెలిసింది అంటూ చైతన్య కామెంట్ రూపంలో పెట్టాడు.

అందుకోసం కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక…!?
0 votes, 0.00 avg. rating (0% score)