నిహారిక-చైతన్య భోగి వేడుకలు.. వైర‌ల్‌గా ఫొటోలు!

January 13, 2021 at 1:53 pm

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె, న‌టి నిహారిక ఇటీవ‌ల గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను పెళ్లాడి.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో నిహారిక-చైతుల‌ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది.

 చైతన్య, నిహారిక కొణిదెల (Image: Twitter)

ఇక ఇటీవ‌ల ఈ జంట పెళ్లై నెల రోజుల‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు భోగి సంద‌ర్భంగా అందరిలాగే మెగా ఫ్యామిలీ కూడా భోగి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుక‌ల్లో కొత్త జంట నిహారిక-చైతన్య కూడా పాల్గొన్నారు.

 భోగి మంటల వద్ద నిహారిక, చైతన్య

పెళ్లైన త‌ర్వాత వ‌చ్చిన మొద‌టి భోగి పండ‌గ కావ‌డంతో.. నిహారిక‌, చైతు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఆ ఫొటోల‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

 

నిహారిక-చైతన్య భోగి వేడుకలు.. వైర‌ల్‌గా ఫొటోలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts