60 ఏళ్ల వయసులో టాలీవుడ్ హీరో !

January 25, 2021 at 1:38 pm

టాలీవుడ్‌ హ్యాండ్సమ్ హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నితిన్ రీసెంట్ గా నటించిన చెక్, రంగ్ దే మూవీస్ విడుదలకు దగ్గర పడ్డాయి. ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందాదున్ రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ చాలా తక్కువ సమయం లోనే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది.

ఆ తరువాత కృష్ణ చైతన్య డైరెక్షన్‌ లో రానున్న పవర్‌ పేట చిత్రంలోను నితిన్ నటించనున్నాడు. అయితే ఈ మూవీ నుండి తాజాగా ఓ అప్డేట్ ఆసక్తి రేకిస్తుంది. నితిన్ ఈ చిత్రంలో 60 ఏళ్ల వయసులో కనిపించనున్నాడని టాక్. రీసెంట్ గా నితిన్ లుక్ టెస్ట్ కూడా జరిగిందట. నితిన్ లుక్ తో మూవీ యూనిట్ అంతా సంతృప్తి వ్యక్తం చేశారని వినికిడి. దీనికి సంబందించిన పోస్టర్ కూడా అతి త్వరలో రిలీజ్ కానుందని సమాచారం.

60 ఏళ్ల వయసులో టాలీవుడ్ హీరో !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts