నాన్ స్టాప్‌గా `ఎఫ్ 3` షూటింగ్.. అనిల్ రావిపూడ్ పోస్ట్ వైర‌ల్‌!

January 18, 2021 at 12:43 pm

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన `ఎఫ్ 2` ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఎఫ్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద మాత్ర‌మే కాదు జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ పొందింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఎఫ్ 3` తెర‌కెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి.

ఎఫ్‌ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్‌ 3’ని కూడా నిర్మిస్తున్నారు. ఇక‌ ఈసారి మూడింతల వినోదంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌ర‌పుకుంటోంది. ఇలాంటి త‌రుణంలో డైరెక్ట‌ర్ అనిల్ పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

`రాత్రి, పగలూ అనే తేడా లేకుండా నాన్-స్టాప్ షూటింగ్. వీకెండ్స్‌లో కూడా షూటింగ్‌తోనే బిజీ. ఎందుకంటే ఫన్‌కు సెలవులు ఉండవ`ని అనిల్ పేర్కొంటూ ఓ ఫొటో షేర్ చేశారు. వరుణ్ తేజ్, సునీల్, దిల్ రాజు, అనిల్ రావిపూడితో పాటు మ‌రొక‌రు షూటింగ్ స్పాట్‌లో కూర్చుని ఉన్న‌ట్టు ఈ ఫొటోలో క‌నిపిస్తున్నారు. ఇక అనిల్ పోస్ట్ బ‌ట్టీ చూస్తుంటే.. అతి త్వ‌ర‌లోనే ఎఫ్ 3 ప్రేక్ష‌కులు ముందుకు రానుంద‌ని అర్థమ‌వుతోంది.

నాన్ స్టాప్‌గా `ఎఫ్ 3` షూటింగ్.. అనిల్ రావిపూడ్ పోస్ట్ వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts