ఎన్టీఆర్ 25వ వర్ధంతి.. నివాళులు అర్పించిన బాల‌య్య‌!

January 18, 2021 at 12:07 pm

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి నేడు. సినిమాల్లోనూ, రాజ‌కీయాల్లోనూ, వ్యాపారాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసి అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్.

 NTR Death Anniversary: సినిమాలు, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారులైన బాలకృష్ణ, రామకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. (Twitter/Photo)

ఇక ఆయ‌న 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ కుమారులైన బాలకృష్ణ, రామకృష్ణ, అల్లుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

 ఎన్టీఆర్ ఘాట్ వద్ద తండ్రి రామారావుకు నివాళులు అర్పిస్తోన్న బాలకృష్ణ (Twitter/Photo)

మ‌రోవైపు తార‌క్‌, క‌ళ్యాణ్ రామ్‌లు సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ..నేటికీ.. ముమ్మాటికీ..ధ్రువ తార మీరే అని ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌లు ట్వీట్ చేశారు. వీరి ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Nandamuri Balakrishna remembers his father fondly

ఎన్టీఆర్ 25వ వర్ధంతి.. నివాళులు అర్పించిన బాల‌య్య‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts