
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన `ఎఫ్ 2` ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఎఫ్ 3` రాబోతోంది. ఈ సీక్వెల్ మరింత ఫన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శర వేగంగా జరుగుతోంది.
ఈ సీక్కెల్ చిత్రాన్ని కూడా దిల్‌రాజు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో వరున్తో పాటు మరో మెగా హీరో కూడా కనిపించనున్నాడట.
ఇంతకీ ఆ మెగా హీరో ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్. `ఎఫ్-2’ క్లైమాక్స్‌లో వచ్చే అనసూయ, వెన్నెల కిషోర్ పాత్రలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. అయితే ప్రస్తుతం ఎఫ్-3లో కూడా సాయి ధరమ్ తేజ్ పాత్ర ఇలా క్లైమాక్స్‌లో వస్తుందని చర్చ జరుగుతోంది. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్రను దర్శకుడు చాలా ఫన్నీగా రూపొందించాడని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.