
వన్ ప్లస్ చివరకు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11బీటా బిల్డ్ ను వన్‌ప్లస్ 7, 7టీ సిరీస్‌లకు రిలీజ్ చేస్తోంది. ఈ కొత్త బిల్డ్ ను ఇతర మొబైల్ కంపెనీలతో పోలిస్తే చాలా ఆలస్యంగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. మిగతా వన్‌ప్లస్ కస్టమర్స్ కి ఈ అప్డేట్ త్వరలోనే అందనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ నార్డ్ ఇది వరకే ఆక్సిజన్ ఓఎస్ 11 బీటా బిల్డ్‌ను అందుకున్నాయి. దీని తర్వాత 2019 రిలీజ్ అయిన వన్‌ప్లస్ 7, 7టీ మొబైల్స్ కు అప్డేట్ రావడం మొదలైంది.
ఈ అప్డేట్ దశల వారీగా రానున్నట్లు వారు ప్రకటించింది . ఈ బిల్డ్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇంకా ప్రధానంగా కెమెరా ఇంటర్ఫేస్ మెరుగుదలతో పాటు హెచ్‌ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. కాని ఇది బీటా బిల్డ్ కాబట్టి వన్ ప్లస్ టెస్టింగ్ లో భాగంగా కొన్ని ఫీచర్స్ సరిగా పని చేయకపోవచ్చు. కొందరు ఇప్పటికే వీటిలో విద్యుత్ వినియోగం బాగా పెరిగినట్లు గమనించారు.