మరో రికార్డును సృష్టించిన ప్రపంచ కుబేరుడు..!?

January 25, 2021 at 3:16 pm

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రికార్డును ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొల్ల గోట్టాడు. ఆయనకు చెందిన స్పేస్‌ ఎక్స్ కంపెనీ ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్షం లోకి పంపించింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఇస్రో కి ఉండేది. 2917లో పీఎస్ఎల్‌వీ రాకెట్ సాయంతో భారత్ 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇన్ని శాటిలైట్లను ఒకేసారి పంపించడం చరిత్రలో ఇదే ప్రధమం.

అయితే ఇప్పుడు ఈ రికార్డును స్పేస్ ఎక్స్ బద్దలు కొట్టింది. ఈ సంస్థ ప్రయోగించిన ట్రాన్స్‌పోర్టర్-1 రాకెట్లో 133 ప్రభుత్వ, ప్రైవేటు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 10 స్టార్ లింక్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద స్పేస్ఎక్స్ రాకెట్ 143 ఉపగ్రహాలను ఒక్కసారే అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది. స్మాల్‌శాట్ రైడ్‌షేర్ ప్రోగ్రామ్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు స్పేస్ఎక్స్ అధికారులు తెలిపారు.

మరో రికార్డును సృష్టించిన ప్రపంచ కుబేరుడు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts