ప్లేబాయ్‌ మోడల్‌ పమేలా ఆరో వివాహం..!!

January 28, 2021 at 3:01 pm

ప్రముఖ మాజీ నటి, ప్లేబాయ్‌ మోడల్‌ పమేలా అండర్సన్‌ తన బాడీగార్డ్‌ డాన్‌ హేరస్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం క్రిస్‌మస్‌ రోజున వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని పలు వార్తలు వచ్చాయి. ఇది పమేలా ఆరో వివాహం కావడం గమనార్హం. మొదట ఆమె 1995లో టామీ లీని పెళ్లి చేసుకుని ఆయనతో ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. వారు 1998లో విడిపోగా 2006లో పమేలా సింగర్‌ కిడ్‌ రాక్‌తో మళ్ళి ఒక్కటయ్యారు.

ఆ తర్వాతి సంవత్సరమే వారిద్దరూ విడిపోగా, 2007లో రిక్‌ సాల్మన్‌ను పెండ్లాడిన పమేలా మరుసటి సంవత్సరమే ఆయనకి విడాకులిచ్చారు. కానీ మరలా 2014లో వారిద్దరూ మరోకసారి పెళ్లి చేసుకోని మరుసటి సంవత్సరం ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక 2020లో పమేలా జాన్‌ పీటర్స్‌ను వివాహం ఆడి, 12 రోజులకే ఆయనతో విడిపోయారు. కాగా వికీలీక్స్‌ ఫౌండర్‌ జులియన్‌ అసాంజేతోనూ పమేలాకు సంబంధాలున్నాయని వార్తల్లోకి ఎక్కారు.

ప్లేబాయ్‌ మోడల్‌ పమేలా ఆరో వివాహం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts