జోరు చూపిస్తున్న ప‌వ‌న్‌.. ర‌వితేజ డైరెక్టర్‌తో ప‌వ‌ర్ స్టార్ సినిమా?

January 23, 2021 at 12:09 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓవైపు రాజ‌కీయాలు చేస్తూనే మ‌రోవైపు వ‌రుస సినిమాల‌ను ఒప్పుకుంటూ జోరు చూపిస్తున్నారు. ఇప్ప‌టికే వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌తంలో రాబోతోన్న `‌వకీల్ సాబ్` సినిమాను పూర్తి చేసిన ప‌వ‌న్‌.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంతో పాటు మలయాళంలో హిట్టైన `అయ్యప్పనుమ్ కోషియమ్` తెలుగు రీమేక్ చేసేందుకు కూడా ఓకే చెప్పాడు.

ఈ రీమేక్ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వ‌హించ‌బోతున్నారు. ఇందులో ప‌వ‌న్‌తో పాటుగా ద‌గ్గుబాటి రానా కూడా న‌టించ‌నున్నాడు. అయితే ఈ చిత్రాలు పూర్తి కాకుండానే.. తాజాగా మ‌రో డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు ప‌వ‌న్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. రమేష్ వర్మ. ప్ర‌స్తుతం ఈయ‌న రవితేజ‌ హీరోగా ‘ఖిలాడీ’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అయితే ర‌మేష్ వ‌ర్మ ఇటీవలే పవన్‌కి ఓ స్టోరీ లైన్ వినిపించి.. ఆయ‌న‌తో ఓకే కూడా అనిపించుకున్నారట. ఈ లైన్ పవన్‌కి నచ్చడంతో కథను డెవలప్ చేయాల్సిందిగా సూచించినట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఇక క్రిష్, హ‌రీష్ శంక‌ర్, సాగర్ చంద్ర చిత్రాల త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ సినిమా చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

జోరు చూపిస్తున్న ప‌వ‌న్‌.. ర‌వితేజ డైరెక్టర్‌తో ప‌వ‌ర్ స్టార్ సినిమా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts