మరో సినిమాకి సిద్ధమైన పవన్…!?

January 25, 2021 at 3:28 pm

టాలీవుడ్ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వకీల్‌సాబ్‌ షూటింగ్‌ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అదే విధంగా దర్శకుడు క్రిష్‌, పవన్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లోనూ పవన్‌ ఓ మూవీకి సంతకం చేశారు. తాజాగా పవన్ కల్యాణ్‌‌‌, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్‌ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

మాళయాళంలో సూపర్‌ హిట్టైన అయ్యప్పనుమ్‌ కోషియమ్ చిత్రం ఇప్పటికే హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో పవన్‌ పాల్గొన్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టు చేసేందుకు ఆయన పచ్చ జెండా ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ రమేష్‌ వర్మ పవన్‌ కోసం కోసం ఓ కథను సిద్ధం చేశాడట. స్క్ట్రిప్ట్ నచ్చడంతో ఈ మూవీ కూడా పవన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు ఏడు సినిమాలు పవన్‌ చేతిలో ఉన్నట్లు తాజా సమాచారం.

మరో సినిమాకి సిద్ధమైన పవన్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts