
ఇటీవల `వకీల్ సాబ్` షూటింగ్‌ను పూర్తి చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తన 27వ సినిమాను పట్టాలెక్కించాడు. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ ఇంతవరకు కనిపించిన కొత్త పాత్రలో నటించబోతున్నారు.
ఇక ఇటీవలె ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే చక చక జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడనుందట. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగుతోంది. వచ్చే గురువారంతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఆ తర్వాత షెడ్యూల్ లో రెండు పాటలను ప్లాన్ చేస్తున్నారట క్రిష్.
ఈ షెడ్యూల్ పూర్తికాగానే .. సుమారు ఇరవై రోజులపాటు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నారట పవన్. అయితే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావించారు క్రిష్. కానీ, ఇలా షూటింగ్ మధ్యలో పవన్ బ్రేక్ తీసుకోవడం ఆయనకు పెద్ద షాకనే అంటున్నారు.