‘వకీల్ సాబ్’ టీజ‌ర్ క్రేజీ రికార్డ్‌.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ప‌వ‌న్‌!

January 15, 2021 at 7:36 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ప్ర‌భాస్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వ‌హిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, శ్రుతి హాస‌న్ హీరోయిన్లుగా న‌టించారు. అయితే తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేశారు.

ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డ‌మే కాదు.. యూట్యూబ్‌ను కూడా షేక్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ క్ర‌మంలోనే విడుద‌లైన కేవలం 12 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్ మరియు 6 లక్షల77 వేల లైక్స్ తో సాలిడ్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డుల‌ను ఈ టీజ‌ర్ త‌న ఖాతాలో వేసుకుంది.

మ‌రి ముందు మందు ఈ టీజ‌ర్ ఎలాంటి రికార్డులు నెల‌కొల్పుతుందో చూడాల్సి ఉంది. కాగా, ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తోంది.

‘వకీల్ సాబ్’ టీజ‌ర్ క్రేజీ రికార్డ్‌.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ప‌వ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts