
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు రాజకీయాలు, మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `వకీల్ సాబ్` సినిమాను పూర్తి చేసిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం మరియు మలయాళ సూపర్ హిట్ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్‌లో నటించనున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లిన జనసేనాని ఈ రోజు ఉదయం పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు అర్చకులు తీర్థ, ప్రసాదాలను అందజేశారు.
ఇక పవన్‌తో వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు మరి కొందరు స్థానిక నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, శ్రీవారిని దర్శించుకునేందుకు పవన్ రావడంతో.. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.