న్యూ లుక్‌లో పవర్ స్టార్ పవ‌న్ కళ్యాణ్..!!

January 13, 2021 at 2:42 pm

దాదాపుగా గత రెండేళ్ల పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న సినిమాల‌కు దూరంగా ఉన్న పవర్ స్టార్ ప‌వ‌న్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవ‌ల క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చారిత్రాత్మ‌క చిత్రంతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్‌ రీమేక్ సినిమాని కూడా మొద‌లు పెట్టాడు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీలో రానా ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ప‌వ‌న్, రానా మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందిస్తాయ‌ని అంటున్నారు దర్శకుడు. అయితే ఈ మూవీలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ప‌వ‌న్ తాజాగా పంచె క‌ట్టులో మెరుస్తూ అదిరిపోయాడు. కార్ వ్యాన్ నుండి పంచె ధరించి వ‌స్తున్న ప‌వ‌న్ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌లో ప‌వ‌న్‌ని చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

న్యూ లుక్‌లో పవర్ స్టార్ పవ‌న్ కళ్యాణ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts