న‌లుగురు హీరోయిన్ల‌తో `పిట్ట కథలు`.. టీజర్ విడుద‌ల!

January 20, 2021 at 1:47 pm

ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. న‌లుగురు హీరోయిన్లు.. నాలుగు విభిన్న క‌థ‌లు.. న‌లుగురు ద‌ర్శ‌కులు.. రూపొందించిన సిరీసే `పిట్ట క‌థ‌లు`. త‌రుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంక‌ల్ప్‌రెడ్డి సంయుక్తంగా తీస్తున్న ఈ సిరీస్‌లో మంచు లక్ష్మి, ఈషారెబ్బా, శృతిహాసన్, అమలా పాల్ హీరోయిన్లుగా న‌టించారు.

ఇక జ‌‌గ‌ప‌తిబాబు, అషిమా నర్వాల్‌, స‌త్య‌దేవ్‌, సాన్వే మేఘ‌నా, సంజిగత్ హెగ్డే ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. నలుగురు మహిళలు జీవితాల్లోని ప్రేమ, సాన్నిహిత్యం, ద్రోహం వంటి భావోద్వేగాలు.. వాటికి, వారి నలుగురికి మధ్య కనక్షన్ ఏంటి అన్న పాయింట్‌పై ఈ సిరీస్‌ను బోల్డ్‌గా తెరకెక్కించారు.

రిలీజ్ అయిన టీజర్‌లో కూడా అవి ప్రతిబింబిస్తాయి. మొత్తానికి పిట్టకథలు పేరుతో విడుదలైన ఈ టీజర్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సిరీస్‌ను 190 దేశాలలో నెట్ ప్లిక్స్ లో ఫిబవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవ్వ‌నుంది. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

న‌లుగురు హీరోయిన్ల‌తో `పిట్ట కథలు`.. టీజర్ విడుద‌ల!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts