
సినీ ప్రముఖులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. మూవీ థియేటర్స్‌లోకి రాకముందే ఆన్లైన్లో సినిమా లీకు చేస్తూ వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా జబర్ధస్త్ ఫేమ్ అభి హీరోగా గడ్డం నవీన్ నిర్మించిన పాయింట్ బ్లాక్ మూవీ విడుదలకు ముందే ఆన్లైన్లో రిలీజ్ చేసేసారు. దీంతో వారు ఈ విషయంపై పోలీసు వారికీ ఫిర్యాదు చేశారు.
ఓటీటీకి అమ్మిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ మూవీ కూడా విడుదలకు ముందే ఆన్లైన్ లో లీకైన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మూవీ దర్శక నిర్మాతలు దయచేసి వీటిని ప్రోత్సహించొద్దు అని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.