చెర్రీకి జోడీ దొరికేసింది‌.. త్వ‌ర‌లోనే `ఆచార్య‌` సెట్స్‌లోకి మ‌రో బ్యూటీ!

January 23, 2021 at 11:03 am

మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లోనే శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 40 నిమిషాల నిడివి గల ‘సిద్ధ’ పాత్రలో చెర్రీ పవర్ ఫుల్ గా కనిపించనున్నాడట. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చెర్రీకి జోడీగా ఏ హీరోయిన్ న‌టిస్తార‌న్న‌ది మాత్రం క్లారిటీ లేదు. ఇప్ప‌టికే ర‌‌ష్మిక‌, కియారా అద్వానీ వంటి పేర్లు వినిపించారు.

కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. చ‌ర‌ణ్‌కు స‌ర‌సన పూజా హెగ్డే కన్ఫర్మ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, చరణ్, పూజల మధ్య ఓ పాట కూడా ఉండనుందట. ఇక త్వ‌ర‌లోనే పూజా హెగ్డే కూడా ఆచార్య సెట్స్‌లో అడుగు పెట్ట‌నుంద‌ని ప్ర‌చ‌రారం జ‌ర‌గుఉతోంది. కాగా, చ‌ర‌ణ్ మ‌రియు పూజా హెగ్డే రంగ‌స్థ‌లం చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

చెర్రీకి జోడీ దొరికేసింది‌.. త్వ‌ర‌లోనే `ఆచార్య‌` సెట్స్‌లోకి మ‌రో బ్యూటీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts