ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే?

January 21, 2021 at 11:40 am

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో ఫ్లాపులు ఎదుర్కొన్నా.. ఆ త‌ర్వ‌త మాత్రం వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న పూజా.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మ‌డుకు కోలీవుడ్ స్టార్ హీరో సినిమా నుంచి ఓ బంప‌ర్ వ‌చ్చింది. ఇంత‌కీ ఆ స్థార్ హీరో ఎవ‌రో కాదు.. దళపతి విజయ్. మాస్ట‌ర్ చిత్రంతో మంచి విజ‌యం సాధించి విజ‌య్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయ‌బోతున్నారు. అయితే ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న న‌టించేందుకు పూజాను నెల్స‌న్ సంప్ర‌దించ‌గా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని టాక్ న‌డుస్తోంది.

కాగా, 2012లో ‘ముగమూడి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి మొద‌టిసారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా.. ఆ త‌ర్వాట టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత త‌మిళంలో పూజా మ‌రో సినిమా చేయ‌లేదు. అయితే తాజా ప్ర‌చారం నిజ‌మైతే.. మ‌ళ్లీ ఎనిమిదేళ్ల త‌ర్వాత‌ విజ‌య్ సినిమాతో త‌మిళంలో పూజా రీ ఎంట్రీ ఇచ్చిన‌ట్టు అవుతుంది.

ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts