
పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. `ముకుంద` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పూజా.. కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొంది. అయితే ఆ తర్వాత మాత్రం వరుస హిట్లతో క్రేజ్ తెచ్చుకున్న పూజా.. తన కోసం స్టార్ హీరోలు పోటీ పడే రేంజ్‌కు చేరుకుంది.
ఇక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సత్తా చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఈ ఏడాదిలో ఎక్కువ సమయం పాటు బ్రూనోతోనే గడుపుతానని తెలిపింది పూజా. `ప్రతి ఏడాది ఒక్కొక్కరు ఒక్కో కొత్త నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా ఈ కొత్తేడాది ఎక్కువ సమయం బ్రూనోతోనే గడపాలని డిసైడ్ అయ్యాను` అని పూజా తెలిపింది.
ఇక పూజా మనసు దోచిన ఆ బ్రూనో ఎవరో కాదు, ఆమె పెట్ డాగ్. ఈ ఏడాది తన పెట్ డాగ్‌తోనే ఎక్కువ సమయం గడపాలని నిర్ణయం తీసుకుంది పూజా. కాగా, ప్రస్తుతం పూజా ప్రభాస్‌తో రాధేశ్యామ్, అనిఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రణ్వీర్ సింగ్‌తో సర్కస్, సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దివాళి ఇలా పలు ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది.