‘ఆదిపురుష్’ నుంచి న‌యా అప్‌డేట్ వ‌దిలిన ప్ర‌భాస్‌!

January 19, 2021 at 9:35 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే ప్ర‌భాస్ వ‌రుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాడు. అందులో `ఆదిపురుష్‌` ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రంలో రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది.

ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నారు. ఆదిపురుష్‌‌ సినిమా మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతోనే తీయనున్నారు. దీంతో ఈ మూవీకి హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌నిచేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి న‌యా అప్‌డేట్‌ను రివిల్ చేశాడు ప్ర‌భాస్‌. భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా షురూ చేశారు.

ఈ విషయాన్ని ప్రభాస్ మంగళవారం వెల్ల‌డిస్తూ.. మోషన్ క్యాప్చర్ బృందంతో కలిసి డైరెక్టర్ ఓం రౌత్ తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘మోషన్ క్యాప్చర్ స్టార్టయ్యింది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’’ అని ప్రభాస్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ప్ర‌భాస్ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘ఆదిపురుష్’ నుంచి న‌యా అప్‌డేట్ వ‌దిలిన ప్ర‌భాస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts