ప్ర‌భాస్ జోరు.. స‌మ్మ‌ర్ నుంచే ఆ సినిమా స్టార్ట్‌?

January 12, 2021 at 7:58 am

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధే శ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌` సినిమా చేసేందుకు డిసైడ్ అయ్యాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంట‌నే ఓం రౌత్‌తో ఆదిపురుష్‌.. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే వాస్త‌వానికి వీటిలో ముందుగా ప్ర‌క‌టించి మాత్రం నాగ్ అశ్విన్ చిత్ర‌మే. కానీ, ఈ చిత్రానికి విదేశాల నుండి అంతర్జాతీయ సాంకేతిక బృందం పని చేయాల్సి రావడం, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబందించి కూడా విదేశాల్లోనే చేయాల్సి రావడంతో ఈ సినిమాని 2022లో షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని భావించారు.

కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. స‌లార్‌తో పాటుగా నాగ్ అశ్విన్ చిత్రాన్ని కూడా ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకురావాల‌ని ప్ర‌భాస్ ఫిక్స్ అయ్యార‌ట‌. అందుకే సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసినా.. షూటింగ్ మాత్రం సమ్మర్ నుండి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే షూటింగ్‌కు సంబంధించిన సెట్స్ ను కూడా ప్రస్తుతం శరవేగంగా నిర్మించేందుకు నాగ్ అశ్విన్ క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌. మొత్తానికి ప్ర‌భాస్ జోరు చూస్తుంటే.. వ‌చ్చే ఏడాది వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.

ప్ర‌భాస్ జోరు.. స‌మ్మ‌ర్ నుంచే ఆ సినిమా స్టార్ట్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts