
ప్రముఖ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి చిత్రం తర్వాత మరింత ఎక్కువైంది. తెలుగు రాష్రాలలోనే కాదు దేశ విదేశాలలోను ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్.
జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్‌తో త్వరలోనే ప్రేక్షకులని పలకరించనున్నాడు ప్రభాస్. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. అయితే మూవీ అప్డేట్స్ తప్ప పెద్దగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టని ప్రభాస్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మైలు రాయిని సాధించాడు. ఆయన ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య ఆరు మిలియన్స్‌కు చేరింది. రానున్న రోజులలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు.