నేటి నుంచి స్టార్ట్ కానున్న ప్ర‌భాస్ కొత్త సినిమా.. ఖుషీలో ఫ్యాన్స్‌!

January 15, 2021 at 7:55 am

పానిండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇలాంటి త‌రుణంలో ప్ర‌భాస్‌.. తాను గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌`ను నేటి నుంచి సెట్స్‌పైకి తీసుకువెళ్ల‌నున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించ‌నున్నారు.

ఇక క‌నుమ పండ‌గ సందర్భంగా శుక్రవారం(నేడు) ఉదయం 11 గంటలకు ‘సలార్‌’ సినిమాకు లాంఛనంగా కొబ్బరి కాయను కొట్ట‌బోతున్నారు.ఈ కార్యక్రమానికి ‘స‌లార్’ చిత్రయూనిట్ స‌హా క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయ‌ణ్ సీఎన్‌, ద‌ర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, క‌న్నడ రాకింగ్ స్టార్ య‌శ్ స‌హా ఇత‌ర సినీ ప్రముఖులు హాజ‌రుకానున్నారు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. స‌లార్ షూటింగ్ ప్రారంభిస్తుండ‌టంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, సలార్’ కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయం కేటాయిస్తున్నాడని.. ఇది పూర్తి కాగానే ఆదిపురుష్‌ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళతాడ‌ని నెట్టింట్లో ప్ర‌స్తుతం ప్ర‌చారం జ‌రుగుతోంది.

నేటి నుంచి స్టార్ట్ కానున్న ప్ర‌భాస్ కొత్త సినిమా.. ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts