‘రాధేశ్యామ్‌’ యూనిట్‌కి అదిరిపోయే గిఫ్ట్‌లు పంపిన ప్ర‌భాస్!

January 15, 2021 at 7:45 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ యూవీ క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్రం కోసం ప‌ని చేస్తున్న యూనిట్ స‌భ్యులంద‌రికీ సంక్రాంతి కానుక‌గా అదిరిపోయే గిఫ్ట్‌లు పంపారు. రాధేశ్యామ్ యూనిట్ స‌భ్యులంద‌రికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాచ్‌లకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు.

ఇక వైరల్‌గా మారిన పోస్ట్‌ల ఆధారంగా ప్రభాస్‌ అతని చిత్ర యూనిట్‌ సభ్యులకు.. టైటాన్, ట్రాక్ పేరుతో గల వాచ్‌లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్ పంపిన గిఫ్ట్ ల‌తో యూనిట్ స‌భ్యులంద‌రూ ఫుల్ ఖుషీ అయిన‌ట్టు స‌మాచారం. కాగా, ప్ర‌భాస్ ఈ సినిమాతో పాటుగా స‌లార్‌, ఆదిపురుష్ మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

‘రాధేశ్యామ్‌’ యూనిట్‌కి అదిరిపోయే గిఫ్ట్‌లు పంపిన ప్ర‌భాస్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts