
బుల్లి స్టార్ లేడీ యాంకర్లు అయిన అనసూయ, రష్మి, శ్రీముఖిలతో.. ప్రదీప్ మాచిరాజు పబ్‌లో రచ్చ రచ్చ చేశాడు. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. త్వరలోనే యాంకర్ ప్రదీప్ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మున్నా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది.
గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు రెడీ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా `వాహ్ బావా..` అంటూ సాగే ఓ మాస్ బీట్ సాంగ్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
పబ్‌లో సాగే ఈ పాటలో అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖిలు కూడా మెరిసాడు. ముగ్గురు కూడా మూడు రకాల స్టెప్పులతో ప్రదీప్‌తో కలిసి అదరహో అనిపించారు. దీంతో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరియు సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.