
ప్రగ్యా జైశ్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `మిర్చిలాంటి కుర్రాడు` సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రగ్యా జైశ్వాల్.. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాలో నటించింది. ఈ చిత్రంలో చీరకట్టుతో సంప్రదాయబద్ధంగా కనిపించిన ప్రగ్యా.. ఆ తరవాత అవకాశాల కోసం అందాల ఆరబోత మొదలుపెట్టింది.
ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా.. హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే ప్రగ్యాజైశ్వాల్ ప్రస్తుతం బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న ‘బీబీ 3’లో హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ప్రగ్యా ఇటీవల 30వ పుట్టినరోజును జరుపుకుంది.
హైదరాబాద్లోనే ప్రగ్యా బర్త్డే వేడుకలను ఘనగా జరుపుకోగా.. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి ప్రగ్యా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్, యువ హీరో సిద్ధు సందడి చేశారు. వారితో పాటు మరికొందరు కూడా ఈ పార్టీలో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.