29న రిలీజ్ కాబోతున్న ప్రేమ ప్రణవం..!!

January 12, 2021 at 4:16 pm

టాలీవుడ్లో ఈ రోజుల్లో మూవీ ఫేం శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రీ అయ్యర్‌ ముఖ్య పాత్రల్లో కుమార్‌ జి. దర్శత్వంలో తెరకెక్కిన మూవీ ప్రణవం. చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తనూజ.ఎస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తనూజ.ఎస్‌ మాట్లాడుతూ లవ్‌ అండ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది.

ఈ రోజుల్లో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం కొంత విరామం తర్వాత నటించిన సినిమా ఇది. మరోమారు తన నటన ప్రతిభను నిరూపించుకునేలా ప్రణవం ఉంటుంది ఆయన అన్నారు. ఈ చిత్రానికి పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్ని చాలా చక్కగా కుదిరాయి. ఈ నెల 29న సినిమాను మూవీ థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం అంటూ మూవీ బృందం తెలిపారు.

29న రిలీజ్ కాబోతున్న ప్రేమ ప్రణవం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts