`ఆచార్య‌` నుంచి చెర్రీ లుక్ విడుద‌ల‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

January 17, 2021 at 11:26 am

మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ సినిమాను రామ్ చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌గా.. ఓ కీల‌క పాత్ర రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చిరు పవర్‌ఫుల్‌ దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి చెర్రీ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో రామ్ చరణ్ ఎన్న‌డూ లేని విధంగా కొత్త లుక్‌లో మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో క‌న‌ప‌డుతున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ సిద్ధ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు.

కాగా, ఈ రోజు నుంచి రామ్ చరణ్.. ఆచార్య రెగ్యులర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా మా ‘సిద్ధ’ సర్వం అంటూ దర్శకుడు కొరటాల శివ.. రామ్ చరణ్ ప్రీ లుక్ పోస్ట్ చేసి స్వాగతం పలికాడు. దీంతో మొత్తానికి రామ్‌చరణ్‌ మీద షూటింగ్‌ ప్రారంభమైనట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక చెర్రీ క‌రోనా నుంచి కోలుకుని.. ఆచార్య షూటింగ్‌లో జాయిన్ అవ్వ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

`ఆచార్య‌` నుంచి చెర్రీ లుక్ విడుద‌ల‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts