లాక్‌డౌన్ దేవుడిచ్చిన వరం.. ప్రియ‌మ‌ణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

January 19, 2021 at 12:32 pm

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో ప్రాణం పోసుకున్న ఈ వైర‌స్ చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి.. ప్ర‌జ‌ల‌ను నానా తిప్ప‌లు పెట్టింది. ఇక ఈ క‌రోనాను అదుపు చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు కొన్ని నెల‌లు పాలు పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించేశాయి. దీంతో అన్ని రంగాల‌కు చెంద‌ని వారు ఇంటికే ప‌రిమితం అయ్యారు.

ఇక ఇటీవ‌ల అన్ని దేశాలు లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ త‌మ ప‌నుల్లో బిజీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి లాక్‌డౌన్‌పై ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ.. ఫ్యామిలీ టైమ్‌ కాస్త దొరికితే బావుండు అని ఆలోచిస్తున్న వాళ్లందరికీ లాక్‌ డౌన్‌ సమయం దేవుడు ఇచ్చిన వరంలా అనిపించిందన్నారు.

ముఖ్యంగా లాక్‌డౌన్ వ‌ల్ల తనకు ఫ్యామిలీతో చాలా ఎక్కువ టైమ్‌ గడిపే అవకాశం దొరికిందని సంతోషించారు. ఇక కావాల్సినంత సమయం గడిపిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం మరింత సంతోషంగా ఉందని వెల్లడించారు. కాగా, ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి వెంకటేశ్ స‌ర‌స‌న‌ నారప్ప సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు ఈమె న‌టించిన `ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

 

లాక్‌డౌన్ దేవుడిచ్చిన వరం.. ప్రియ‌మ‌ణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts