హీరో శింబు కు షాకిచ్చిన ప్రొడ్యూసర్…!?

January 19, 2021 at 2:50 pm

ప్రముఖ తమిళ స్టార్ హీరో శింబుకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనకీ నిర్మాతల మండలి నుండి పెద్ద షాక్ తగిలింది. ఇకమీదట శింబు నిర్మించబోయే సినిమాలకు ఏ మాత్రం సహకరించకూడదని తమిళ చిత్ర నిర్మాత మండలి ఏకగ్రీవ తీర్మానం చేయడం విశేషం. ప్రముఖ నిర్మాత బాలాజీ కబాకు చెల్లించాల్సిన బకాయిని ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చెల్లంచడంలో శింబు మాట తప్పినందుకె సహాయ నిరాకరణ చేయాలని నిర్మాత మండలి నిర్ణయించింది. అసలు నిర్మాతల మండలి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణాలుఏంటంటే శింబు హీరోగా ప్రముఖ నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ అన్బానవన్‌ అరసాదవన్‌ అడంగాదవన్‌ అనే చిత్రాన్మి నిర్మించారు. ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్న శింబు, తన ఇష్టం మేరకు నిర్మించారు. అయితే ఈ మూవీ పెద్ద ఫ్లాప్‌ అయింది. దీంతో నిర్మాతకు కోట్లాది రూపాయల మేరకు నష్టం వచ్చిన క్రమంలో నిర్మాత, హీరో మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం శింబు ఒక చిత్రాన్ని ఉచితంగా చేసి పెట్టేందుకు అంగీకరించారు.

ఆ ప్రకారంగా వారిద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఈ విషయంలో శింబు మాట తప్పారు. తాను ఉచితంగా సినిమా చేసి పెట్టేందుకు నిరాకరించారు. ఈ వ్యవహారంపై నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నిర్మాతల మండలి ఇరు వర్గాలను పిలిచి సంప్రదింపులు జరపగా నిర్మాత కోరిక మేరకు శింబు ఒక చిత్రంలో ఏమి తీసుకోకుండా నటించాల లేకపోతే రూ.6.60 కోట్లను చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానం చేసింది. ఒప్పంద పత్రాలపై ఇరు వర్గాలు సంతకాలు చేశారు. కానీ హీరో శింబు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఫ్రీగా మూవీ చేయలేదు సరి కదా చెల్లించాల్సిన రూ.2.20 కోట్లను కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ తిరిగి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చెయ్యగా దీనిపై సీరియస్‌ అయిన నిర్మాతల మండలి శనివారం అత్యవసరంగా సమావేశమై శింబు భవిష్యత్తులో నటించే సినిమాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరాదని వారు తీర్మానించింది. దీంతో ఇకమీదట శింబుకు కష్టాలు తప్పేలా కనిపించటం లేదు.

హీరో శింబు కు షాకిచ్చిన ప్రొడ్యూసర్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts