సూపర్ ఆఫర్ : అక్కడ భోజనం చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీ సొంతం..!?

January 20, 2021 at 4:04 pm

వ్యాపారం చెయ్యడమే కాదు అందులో రాణించటం కూడా తెలిసి ఉండాలి. చాలా ముఖ్య మైంది మార్కెట్‌ చేసుకోవడం తెలియాలి. కస్టమర్లు వారంతా వారే వచ్చేస్తారన్నమాట. తాజాగా మహారాష్ట్రలోని ఓ హోటల్‌ యజమానికి మంచి ఐడియా తట్టింది. వెంటనే బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కేవలం 60 నిముషాల్లో తాము పెట్టిన భోజనం పూర్తి చేస్తే చాలు కలలుగనే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ సొంతం అవుతుందన్నమాట. భోజనం మాములుగా 15 నిమిషాల్లోలేదా అరగంటలో ఫినిష్‌ చేస్తానని గొప్పలు పోకండి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అది ఏంటంటే వారు వడ్డించే భోజనం ఖరీదు అక్షరాలా రూ.2,500 .

అసలు వివరాల్లోకి వెళ్తే పుణె శివారులోని వాడ్గావ్ మావల్ ప్రాంతంలో ఓ హోటల్‌ ఉంది. కరోనా కారణంగా హోటల్‌ రంగం దెబ్బ కొట్టడంతో బిజినెస్‌ పెంచుకోవడం పై ఫోకస్‌ పెట్టాడు హోటల్ ఓనర్. అందులో భాగంగా బుల్లెట్ బైక్ అనే కంటెస్ట్ ప్రకటించిన శివరాజ్ హోటల్ దానికి చివర్లు షరతులు కూడా వర్తిస్తాయనే బోర్డు కూడా పెట్టారు. అంటే ఆ హోటల్‌ వారు పెట్టే నాన్ ‌వెజ్ భోజనాన్ని కేవలం 60 నిమిషాల్లోనే ఖతం ‌ చేయాలి. ఆ భోజనంలో 4 కిలోల మటన్, చేపలతో తయారు చేసిన 12 రకాల వంటకాలు వడ్డిస్తారు. వీటితో చేపల వేపుడు, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ వంటి పలు రుచికరమైన భోజనమే వడ్డిస్తారు. దీనికి మీరు కట్టాల్సింది కేవలం రూ.2,500. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి 60 నిమిషాల్లో భోజనాన్ని పూర్తి చేస్తే చాలు మీకు రూ.1.65 లక్షలు విలువ చేసే బుల్లెట్‌ సొంతం అవుతుంది. ఇప్పుడు తాజాగా ఈ ప్రకటన కాస్తా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అయిపొయింది. ఈ బంపరాఫర్‌కు సూపర్ స్పందన వచ్చిందట. చాలా మంది ఈ ఛాలెంజ్‌లో ఫెయిల్ కాగా సోలాపూర్‌కు చెందిన సోమ్‌నాథ్ పవర్ అనే వ్యక్తి మాత్రం ఇచ్చిన సమయం లోపల ఫినిష్‌ చేసి బుల్లెట్‌ గెల్చుకోవడం మరో విశేషం.

సూపర్ ఆఫర్ : అక్కడ భోజనం చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీ సొంతం..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts